ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన[PMJDY] ఫుల్ డీటెయిల్స్ IN తెలుగు 2025 ప్రధానమంత్రి జన్ ధన్ యోజన [PMJDY]అనేది భారత ప్రభుత్వ అత్యంత విజయవంతమైన సామాజిక ఆర్థిక కార్యక్రమాల్లో ఒకటి. దీన్ని 2014 ఆగస్టు 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం బ్యాంకింగ్ సేవలను అన్ని సామాన్య ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, అందుబాటులోకి తేవడం. ఇది ఒక విధంగా సర్వే జనాః సుఖినోభవంతు అనే సూత్రాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించబడిన పథకం.

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన[PMJDY] ఫుల్ డీటెయిల్స్ IN తెలుగు 2025.
PMJDY పథకం ద్వారా ప్రభుత్వం ముందుగా కొన్ని ప్రధాన లక్ష్యాలను నిర్దేశించింది.
1.ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ కల్పించడం
2. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రభుత్వ సబ్సిడీలను నేరుగా ఖాతాదారులకు పంపించడం.
3. ఫైనాన్షియల్ లీటరసీ పెంచడం
4. ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకునే అలవాటును అభివృద్ధి చేయడం.
5. బీమా పింఛన్ వంటి సేవలను అందించడం
6. ప్రజలలో డిజిటల్ పేమెంట్స్ విషయంలో అవగాహన పెంచడం.
ఈ ఖాతా యొక్క విశేషతలు
PMJDY ఖాతా అనేది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా. అంటే ఖాతా ఓపెన్ చేసినప్పుడు ఖాతాలో డబ్బు లేకపోయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పేదవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ముఖ్య ప్రత్యేకతలు
1. జీరో బ్యాలెన్స్ అకౌంట్-డబ్బు లేకుండా ఖాతా ఓపెన్ చేయవచ్చు.
2. రూపే డెబిట్ కార్డు ఉచితం-డెబిట్ కార్డు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
3. బీమా సౌకర్యం-2 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది
4. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం-ఆరు నెలల తర్వాత పదివేల వరకు ఓవర్డ్రాఫ్ట్ ఉంటుంది.
5. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్-ప్రభుత్వం అందించే సబ్సిడీలు నేరుగా ఖాతాల్లో జమవుతాయి.
6. మొబైల్ బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ అలర్ట్-స్మార్ట్ ఫోన్ లేకున్నా ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారుడికి సమాచారం అందుతుంది.https://smstechintelugu.com/
అవసరమైన పత్రాలు
PMJDY ఖాతాను దేశంలోని ఏదైనా బ్యాంకు బ్రాంచ్ లో తీసుకోవచ్చు
1. సరళమైన ప్రాసెస్
2. గ్రామీణ మరియు అర్బన్ బ్యాంకు బ్రాంచీలు
3. బ్యాంకు బిసి ల వద్ద కూడా ఖాతా ఓపెన్ చేయవచ్చు
4. పోస్ట్ ఆఫీస్ లో కూడా ఈ ఖాతాలు ఓపెన్ చేయవచ్చు.
5. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, అడ్రస్ ప్రూఫ్, మైల్డ్ కేవైసీ సరిపోతాయి.
రూపే కార్డు గురించి వివరాలు
1.ఉచితంగా కార్డులభ్యమవుతుంది
2. ఏటీఎం కార్డు ద్వారా రెండు లక్షల వరకు ప్రమాద బీమా
3. ఏటీఎంలలో డబ్బు తీసుకోవచ్చు
4. డిజిటల్ పేమెంట్ కోసం ఉపయోగి పడుతుంది
5. యాక్టివ్ గా వాడితే భీమా వర్తిస్తుంది.https://www.pmjdy.gov.in/
దీనికి ఎవరు అర్హులు
ఈ పథకంలో ప్రతి భారతీయుడు కూడా తీసుకోవచ్చు
1. వయస్సు 10 సంవత్సరాల పైబడిన వారు
2. భారత పౌరులు
3. గతంలో బ్యాంకు ఖాతా లేనివారు
4. పేద మధ్యతరగతి కుటుంబాలు
5. గ్రామీణ ప్రజలు అజ్ఞాన పేదలు
ఖాతా ద్వారా లభించే సేవలు
1. బీమా సౌకర్యం-యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒక లక్ష వరకు ఉంటుంది
2. ఖాతాదారుడు రూపే కార్డు ఆక్టివ్ గా వాడితే మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం
ఖాతా ప్రారంభించిన ఆరు నెలల తర్వాత ఇది వర్తిస్తుంది సగటున పదివేల వరకు ఉంటుంది. ఖాతాదారి ఆర్థిక స్థితిని బట్టి బ్యాంకు నిర్ధారిస్తుంది.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్
రేషన్, ఎల్పిజి సబ్సిడీ, రైతుబంధు, పింఛన్ వంటి, ప్రభుత్వం సబ్సిడీలు నేరుగా ఖాతాదారుని బ్యాంకు లోకి పడతాయి.
బ్యాంకింగ్ సదుపాయాలు
మొబైల్ బ్యాంకింగ్ మినీ స్టేట్మెంట్లు బిల్ పేమెంట్స్ బ్యాలెన్స్ చెకింగ్ స్టేట్మెంట్ మొదలైనవి ఇందులో చెక్ చేసుకోవచ్చు.
ఈ పథకం వల్ల లాభాలు
1. ప్రజలలో బ్యాంకింగ్ అలవాటు పెరుగుతుంది.
2. డిజిటల్ లావాదేవీలు అభివృద్ధి చెందుతాయి.
3. బ్యాంకులకు డిపాజిట్లు పెరిగాయి.
4. ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా చేరడంతో మధ్యవర్తులు తొలగిపోయారు.
5. చిన్న వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం లభించింది.
6. ప్రమాదాల సమయంలో భీమా కవరేజీ అందుబాటులో ఉంటుంది.
7. మహిళలకు ఆర్థిక స్వావలంబన అందుతుంది.
కొన్ని జాగ్రత్తలు
1.రూపే కార్డు వాడకపోతే భీమా వర్తించదు.
2 అకౌంట్ యాక్టివ్ గా ఉండాలి.
3. ఈటా కనీసం ఒకసారి ట్రాన్సాక్షన్ చేయాలి.
4. అనవసరంగా అకౌంట్ ఓపెన్ చేయకూడదు. కేవలం లాభం కోసం కాకుండా అవసరం ఉండాలి.
PMJDY ద్వారా పొందే ఇతర సేవలు
పీఎం సురక్ష బీమా యోజన-12 ప్రీమియం
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన-330 ప్రీమియం
అటల్ పెన్షన్ యోజన
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్
సాధించిన విజయం
1. మొత్తం 50 కోట్లకు పైగా ఖాతాలను ఓపెన్చేశారు.
2.2.10 లక్షల కోట్ల డిపాజిట్లు
3. సుమారు 70% ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో
4. 55పర్సెంట్ ఖాతాదారులు మహిళలు
5. దాదాపు 34 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ అయ్యాయి.
ముగింపు
ప్రధానమంత్రి జనధన్ యోజన అనేది సామాన్య ప్రజలకు ఆర్థికంగా స్వావలంబనంగా మారెందుకు ఒక గొప్ప అవకాశాన్ని కలిగించే పథకం. ఇది పేదలకు బ్యాంకింగ్ ప్రపంచానికి గేట్ వేల మారింది. ఈ పథకం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రజల మధ్య ఆర్థిక అందరం క్రమంగా తగ్గుతోంది. బ్యాంకింగ్ సేవలు డిజిటల్ లావాదేవీలు ప్రభుత్వ ప్రయోజనాల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బీమా సేవలు అన్నింటిని ఒకే అకౌంట్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పేదలకు ఆర్థిక స్వావలంబన భీమా పింఛన్ ఉపాధి నిధులు లాంటి లాభాలు చెందుతున్నాయి గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాయి.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక గొప్ప వ్యక్తి పథకం. దీని ద్వారా ప్రతి పేద వ్యక్తికి బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్, భీమా మరియు ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది.201 లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా కోట్లాదిమంది పౌరులు బ్యాంకింగ్ వ్యవస్థకు చేరడంతోపాటు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నేరుగా వారి ఖాతాల్లోకి రావడం ప్రారంభమైంది. ఇది పేదలకు ఆర్థిక భద్రతను కలిగించడమే కాక దేశ అభివృద్ధికి బలమైన పునాది కూడా అయ్యింది.
1 thought on “ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన[PMJDY] ఫుల్ డీటెయిల్స్ IN తెలుగు 2025”