kannappa movie review 2025

kannappa movie review 2025

MOVIE NAME ; KANNAPPA

DIRECTOR ; MUKESH KUMAR SING

PRODUCER ; MOHAN BABU

EDITING ; ANTONY

MUSIC ; STEFEN DEVASI

CAMERA ; SHELTON CHAV

RATING ; 2.5/5

RELEASE DATE ; 27 JUNE 2025

ACTRESS ; MANCHU VISHNU,PREETHI MUKUNDAN,MOHAN BABU,SARATH KUMAR,MADHU BALA,MOHAN LAL,MUKESH RISHI,BRAHMAJI,DEVARAJ,BRAHMANANDAM,SAPTAGIRI,RAGHU BABU,AISHWARYA BHASKARAN,LAVI PAGNI,SHIVA BALAJI,AND MORE.

kannappa movie review 2025 ” బెదర కన్నప్ప” గా కన్నడ రాజకుమార్ 1954 లోను ” భక్తకన్నప్ప” గా కృష్ణంరాజు1976 లోను కనిపిస్తే ఈ2025 లో ” కన్నప్ప” గా మంచు విష్ణు తెరమీద కొచ్చాడు. ఈ కొత్త” కన్నప్ప” మంచు విష్ణు అసలు కథ కొంత కల్పితం కొండంత అని ప్రచారం మొదలైనప్పటికీ నుంచి తెలుస్తూనే ఉంది. సినిమా మొదట్లో మూల కథకి సినిమాటిక్ కల్పితం జోడించామని చెప్పారు. సినిమా ఉద్దేశం మూల కథని పూర్తిగా విస్మరించి గారడి చేయకుండా ప్రేక్షకులకు అనుభూతి కలిగి ంచడం. ఈ విషయంలో ఈ చిత్రం ఎంతవరకు ఫలితాన్ని అందుకుందో చూద్దాం.

kannappa movie review 2025

. శివపార్వతుల సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. పార్వతి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తనకు పరమ భక్తుడు కాబోయే వ్యక్తి భూమి మీద జన్మించాడని చెప్తాడు. అలా కథ ఒక పల్లె గూడానికి షిఫ్ట్ అవుతుంది.. అక్కడ తిన్నడు అనే బాలుడు, అతనికి కేతు అనే స్నేహితుడు ఊరి మంచి కోసం మారెమ్మ అనే వ్యక్తి అమ్మవారికి కేతుని అందరికి సమక్షంలో బలి ఇస్తుంది. అలా తన స్నేహితుడిని బలి తీసుకున్న దైవం పై తిన్నడు చిన్నప్పటి నుంచి వైరం పెంచుకుంటాడు. క్రమేపీ వయసుతోపాటు ఆ వైర్యం పెరిగి పెద్దదవుతుంది.https://smstechintelugu.com/

నాస్తికుడిగా బతుకుతున్న ఆ తిన్నాడు నెమలి అనే పల్లె పడుచు ప్రేమలో పడతాడు. ఆమె శివ భక్తురాలు. ఇదిలా ఉంటే ఆ ఊరికి దగ్గరలో ఒక రహస్య ప్రాంతంలో వాయు లింగం ఉంటుంది. దానిని చేరగలిగే వాడు, చూడగలిగేవాడు, పూజాదులు చేసేవాడు మహాదేవశాస్త్రి అనే బ్రాహ్మణుడు. అన్యులకి వాయువలింగ ప్రదర్శన చేసుకునే అవకాశాన్ని ఇవ్వడు శాస్త్రి. మరోపక్క నుంచి ఆ వాయు లింగం మహత్యం తెలుసుకొని దానిని అపహరించాలని ఒక మూక బయలుదేరుతుంది. ఆ క్రమంలో తిన్నడి తండ్రి నాదనాదుడు మరణిస్తాడు. ప్రతీకారంగా తిన్నడు ఆ మూకని హతమారుస్తాడు. తర్వాత ఏమవుతుంది అలా నాస్తికుడిగా ఉన్నతిన్నడిని చూడు తన వైపుకి తిప్పుకొని ఎలా తనను భక్తుడిగా చేసుకుని మోక్షాన్ని ఇస్తాడు అనేది తక్కిన కథ.

పైన కథని చూస్తే అసలు కన్నప్ప కథకి దీనికి సంబంధం లేనట్టే ఉంటుంది. నిజంగా లేదు కూడా.. అసలు కథకి కొంత కల్పితాన్ని కలిపామన్నారు కదా అదే ఇది తిన్నడు తాను నమ్మిన శివుడికి కళ్ళు అప్పగించే సన్నివేశం తప్ప మిగిలినదంతా కల్పితమే. కథ ఎలా ఉన్నా ఇప్పుడు అనుభూతి ఎలా ఉందో చూద్దాం. ప్రధమార్ధం చూస్తుంటే చాలా సినిమాలు దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి.. హీరో హీరోయిన్ మధ్యన కత్తి యుద్ధంతో సాగే రొమాంటిక్ ట్రాక్ బాహుబలి మాదిరిగా ఉంటుంది. బెబ్బులి అనే వ్యక్తికి తిన్నడికి మధ్యన నాయకత్వ పోటీ ట్రాక్ కూడా బాహుబలిలోని బాహుబలి మల్లాలదేవ ఎపిసోడ్ ని గుర్తు చేస్తుంది.

ఇక చుట్టుపక్కల అన్నేసి పల్లెలు వాళ్ళ మధ్యన వైరాలు అవన్నీ కంగువని జ్ఞప్తికి తెస్తాయి. ఇక తిన్నడు చెప్పే నాస్తిక డైలాగులు రాయలసీమ రామన్న చౌదరిని తలపిస్తాయి ఇలా ఎలా చూసినా ఫస్ట్ ఆఫ్ మొత్తం పలు సినిమాల మెడ్లీల అనిపిస్తుంది. ఆ పల్లెలోని ప్రజల్లో కొన్ని న్యూజిలాండ్ మొహాలు కూడా కనిపించాయి. అలాంటివి అనవసర డిస్ట్రక్షన్ కి గురిచేసాయి. ఈ మైనస్ లు పక్కన పెడితే కథనంలో నిబద్ధత, బోర్ కొట్టించకుండా నడపాలన్న తపన, ప్రతి ఫ్రేమ్ ని ఆసక్తిగా మలచాలన్న ఆలోచన, దైవానికి మించిన శక్తి మరొకటి లేదని అంతర్లీనంగా కన్వే చేసిన తీరు ఆకట్టుకుంటాయి. మరి ముఖ్యంగా ఒక సన్నివేశంలో హీరోయిన్ తాటి ముంజని నొక్కగానే ఆ నీళ్ళు తిన్నడి కంట్లో పడతాయి. ఆ సమయంలో తన కళ్ల గురించి చెప్పే రొమాంటిక్ డైలాగ్ క్లైమాక్స్ కి మంచి పాయింట్ అయింది.https://www.bollymoviereviewz.com/2025/06/kannappa-box-office-collection-day-1-worldwide-budget.html

kannappa movie review 2025

ద్వితీయార్థంలో ప్రభాస్ ఎంట్రీ నుంచి గ్రాఫ్ మారిపోయింది. పరమశివుడి పిలుపు మీద తన అంశం అయిన రుద్రుడి పాత్రలో ప్రభాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మూడు సన్నివేశాల్లో ఏకకాలంలో కనిపిస్తూ ముగ్గురికి ఒకేసారి జ్ఞానోదయం కలిగించే సీన్ చాలా ఆసక్తిగా మలచాడు దర్శకుడు. ఆ సన్నివేశం తర్వాత మంచు విష్ణు నటన హత్తుకుంది. కన్నప్పగా శివుడికి కన్నప్పగించే సీన్ భావోద్వేగం కలిగిస్తుంది. అదే సీన్లో మోహన్ బాబు కూడా భక్తి రసాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడానికి తోడ్పడ్డారు. ఆ విధంగా ద్వితీయార్థంలోని రెండవ భాగం మొత్తం భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ఆ ట్రాక్ మొత్తంలో రాసుకున్న సంభాషణలు కూడా లోతుగా ఉన్నాయి.

అనుభూతినైతే కలిగించారు కానీ ఒక పెద్ద ప్రశ్న మాత్రం మిగిల్చారు. మహాదేవశాస్త్రి ఎంత పండితుడైన వాయు లింగ దర్శనాన్ని తన సొంత కుటుంబ సభ్యులకి, స్వక్కులం వాళ్లకి కూడా కలగకుండా చేసి ఏమి సాధిద్దాం అనుకున్నట్టు ఆ క్లారిటీ లేదు. ఈ పాత్రని కుల భావజాలంతో రాసుకున్నట్టు ఉంది.

బ్రాహ్మణులు తమ వైహంకారంతో దేవుడిని అన్యకులాల వారికి దూరం చేశారని నిజానికి మూలవాసులు ఆదివాసులు అయినా కొండ జాతి వాళ్ళ భక్తే బలమైనదని గొప్పదని చెప్పడానికి పెట్టుకున్న ట్రాక్లా ఈ మూవీ నడుస్తుంది. ఆ పదాలతో మహాదేవశాస్త్రి పాట పాడుతూ కన్నప్ప కాళ్ళకి దండంప పెట్టే సీన్ కూడా ఉంది. అలా అంతర్లీనంగా బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని చూపించారు. నిజానికి బాపు తీసిన భక్తకన్నప్పలో రావు గోపాల్ రావు పోషించిన బ్రాహ్మణ పాత్రని చాలా చీప్ గా చూపించారు. దానితో పోలిస్తే ఇక్కడ మోహన్ బాబుతో నడిపిన బ్రాహ్మణ పండితుడి పాత్ర గంభీరంగాను ఆలోచింపజేసే విధంగాను ఉంది.

మంచు విష్ణు నటన ప్రధమార్ధమంతా సగటు హీరోయిన్తో సాగిన క్లైమాక్స్ లో మాత్రం మనసుల్ని పిండే నటన చూపించాడు. కన్నప్పగించే సీన్లు భక్తుడిగా జీవించాడు. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ మోడల్ లా ఉంది తప్ప ట్రైబల్ లేడీ లా లేనేలేదు. ఆమెని గ్లామర్ ప్రదర్శన కోసం శృతి మించి చూపించారు. ఈ తరహా భక్తి చిత్రానికి ఆమె సీన్లు అడ్డంగానే ఉన్నాయి.. కన్నప్ప తండ్రిగా శరత్ కుమార్ కి స్క్రీన్ ప్రజెంట్ ఉంది. మారెమ్మగా ఐశ్వర్య పాత్ర ఆకట్టుకోకపోగా అతిగా కనిపించింది. ఆమె పక్కన సురేఖ వాణి ప్యాడింగ్ ఆర్టిస్టుల కనిపిస్తూ ఒకచోట చిన్న డైలాగ్ చెప్పింది. మోహన్లాల్ ఒక సీన్ లోను అక్షయ్ కుమార్ రెండు మూడు సార్లు కనిపించినంతవరకు ఓకే.

ప్రభాస్ పాత్ర విడి నిడివి ఎంత సేపు ఉన్నా కథని మలుపు తిప్పే కీలక పాత్ర కావడం ఆ సన్నివేశాల్లో సంభాషణలు బాగుండడంతో ఫలితం చేకూరింది. ఒక గూడానికి నాయకురాలిగా మధుబాల చాలా కాలం తర్వాత తెరమీద దర్శనమిచ్చింది. కానీ ఈమెది కూడా ఏమాత్రం ఆకట్టుకొని పాత్ర రచన. మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నిండైన నటన ప్రదర్శించారు. ఆయన పక్కన శివ బాలాజీ జస్ట్ ప్యాడింగ్ ఆర్టిస్టులా ఉన్నాడు. కన్నప్ప పక్కన మాలిగా కనిపించే బిగ్ బాస్ కౌశిక్ కి మంచి సీన్లే పడ్డాయి.

బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల అవసరం ఏమిటో, వాళ్లు పండించిన హాస్యం ఏమిటో దర్శకుడికే తెలియాలి ఇటుగా అయితే ప్యాడింగ్ కోసం మహా అయితే ఒకటి రెండు డైలాగుల కోసం పెట్టుకున్నారు. దర్శకుడు టీవీ సీరియల్ నేపథ్యం నుంచి రావడం వల్ల లేక తాను నార్త్ ఇండియన్ కావడంవల్ల శివపార్వతులిద్దరూ ఎండి టీవీ సీరియల్ గెటప్ లో ఉన్నారు శివుడి పాత్రని జగన్నాథ అసలా దాఖలాలే కనిపించలేదు. నార్త్ ఇండియన్ పెళ్లిళ్లలో కనిపించే సగటు గెస్ట్ గా ఉంది తప్ప ఆమెలో పార్వతీదేవి తాలూకా గాంబీర్యం లేదు మాతృభావం కనిపించలేదు ఎన్ని చెప్పుకున్నా ఈ చిత్రానికి ఆఖరి అరగంట క్షయంగా అధిక శాతం మందిని ఆకట్టుకుంది.

అలాగని సినిమా అంటే ఆఖరి అరగంట మాత్రమే కాదు ఆద్యంతం ఆకట్టుకుంటూ లోపాలు కనిపించకుండా రక్త కటిస్తూ ఏ డైవర్షన్ లేకుండా వశం చేసుకుంటూ పాటల మధ్యలో కూడా ప్రేక్షకుల్ని బయటకు వెళ్ళనీయకుండా కూర్చోబెట్టినప్పుడే అది గొప్ప చిత్రం అనిపించుకుంటుంది. జరగని చరిత్రని జరిగినట్టు భ్రమింప చేయాలంటే ప్రధమార్ధం కథనం మీద ఇంకా కసరత్తు చేసి ఉండాల్సింది భక్తితో కన్నప్పగించి చూసేవాళ్ళు స్టాండింగ్ ఇచ్చేవాళ్లు ఫైనల్ గా ఈ చిత్రంలో బాగున్నది ఏంటంటే అని ఎవరన్నా అడిగితే ఆఖరి అరగంట అని మాత్రం చెప్పుకోవాలి

kannappa movie review 2025

కన్నప్ప సినిమాలో మంచు విష్ణు తన కెరీర్లో బెస్ట్ పర్ఫామెన్స్ఇచ్చారు. అతిధి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది.. మోహన్లాల్ క్యారెక్టర్ పెద్ద సర్ప్రైజ్ బిజిఎం సినిమాలోని ఎలివేషన్ టాప్ క్లాస్ గా ఉన్నాయి క్లైమాక్స్లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి చివరి సీన్లు కంటతడి పెట్టేస్తాయి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కన్నప్ప సినిమాలో స్టార్స్ చూస్తే కన్నులకు పండుగగా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. కన్నప్ప పాత్రను మంచు విష్ణు చాలా సింపుల్ గా చేసేశాడు ఆ క్యారెక్టర్ లో జీవించాడు ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చిత్రం ఇది.

ప్రభాస్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ రుద్ర పాత్ర గూష్బమ్స్ తెస్తాయి అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మోహన్ బాబు కాజల్ వారి పాత్రలతో ఆకట్టుకున్నారు. స్క్రీన్ ప్లే డీసెంట్ గా ఉంది అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కన్నప్ప సినిమా క్లైమాక్స్లో విష్ణు పర్ఫామెన్స్ చాలా బాగుంది. ప్రభాస్ ఇమియో అదిరిపోయింది సాంగ్స్ చాలా బాగున్నాయి ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది మోహన్ బాబు పాత్ర మరీ బాగుంది. కాళహస్తి కన్నప్ప పాత్రను బాగా చిత్రీకరించారు. ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే వారు రిస్క్ ఆభద్రతాభావంతో చేసి ఉండేవారు కాదు ప్రభాస్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ బాహుబలి తర్వాత మరో పాత్ర ఆయన చేశాడు అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు

శివ నాగవర్ణుడు పరమ భక్తుడి డ్రామాగా రూపొందించిన హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ కన్నప్ప కాళహస్తి ఆలయం నేపథ్యంగా ఈ కథ కొనసాగుతుంది డివోషనల్ అంశాలు బాగా చిత్రీకరించాడు అయితే కథలోకి వెళ్లడం కాస్త లేట్ అయింది ఫిక్షనల్ స్టోరీ ఫ్లాట్ గా సాగడం మైనస్ శివ శివ శంకర సాంగ్ చివరి 20 నిమిషాలు సినిమా గుండెను పిండేస్తుంది భక్తిరస ప్రధాన అంశాలు బాగా ఉన్నాయి మోహన్ బాబు ప్రభాస్ పాత్రలు చాలా బాగున్నాయి వారికి రాసిన డైలాగ్ పవర్ ఫుల్ గా ఉన్నాయి విష్ణు మంచు డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేశాడు గ్రాఫిక్ వర్క్స్ బాగా లేవు కొన్ని సీన్లకు ఇంకా బాగా తీయడానికి ఛాన్స్ ఉంది కన్నప్ప లాంటి లెజెండరీ కథను తెరకెక్కించిన తీరుకు మీరు పడ్డ కృషి కష్టం విజన్ కు ధన్యవాదములు మంచు విష్ణు అన్నకు భారీ విజయం దక్కాలని కోరుకుంటున్నాము అద్భుతమైన నటీనటులతో రూపొందించిన ఈ సినిమాను ఆడియన్స్ ప్రేమ కురిపిస్తారని భావిస్తున్నాము తన మూడో జనరేషన్ ను వెండి ధర మీద చూసుకొని మోహన్ బాబు మురిసిపోవడం ఖాయమని సాయి ధరంతేజ్ ట్వీట్ చేశారు.

1 thought on “kannappa movie review 2025”

Leave a Comment