POST OFFCE MONTHLY INCOME SCHEME IN TELUGU -2025 పొదుపు చేయాలనుకునే మధ్యతరగతి వర్గాలకు భారత ప్రభుత్వ తపాలా శాఖ అందిస్తున్న అత్యుత్తమ స్కీముల్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి. ఇది నెల నెల స్థిర ఆదాయం ఇచ్చే విధంగా రూపొందించబడింది.
ప్రధాన లక్ష్యం
POST OFFCE MONTHLY INCOME SCHEME IN TELUGU -2025
ఈ పథకం ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, లేదా నెల నెల నిశ్చితా ఆదాయం పొందాలనుకునే వారు ఉపయోగించుకోవడానికి తగినది.
ముఖ్య విశేషాలు
| లక్షణం | వివరాలు |
| పథకం పేరు | పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం |
| ప్రారంభించిన సంవత్సరం | 1987 |
| నిర్వహణ | భారత తపాలా శాఖ-ఇండియా పోస్ట్ |
| ఆదాయం రకం | నెల నెల వడ్డీ రూపంలో అందుతుంది |
| ఖాతా గడువు | ఐదు సంవత్సరాలు |
| వడ్డీ రేటు | 7.4 పర్సెంట్ వార్షిక వడ్డీ |
| కనిష్ట పెట్టుబడి | వెయ్యి రూపాయలు |
| గరిష్ట పెట్టుబడి | సింగల్ అయితే 9 లక్షలు, జాయింట్ అయితే 15 లక్షలు |
పథకం ఫీచర్లు
1. నెలనెలా స్థిర ఆదాయం
POST OFFCE MONTHLY INCOME SCHEME IN TELUGU -2025
మీరు ఎన్ని రూపాయలు వేస్తే, దానిమీద 7.4 పర్సెంట్ వార్షిక వడ్డీ లభిస్తుంది. దీనిని నెల నెల చెల్లిస్తారు. ఉదాహరణకి తొమ్మిది లక్షలు వేస్తే సుమారు 5550 వడ్డీ ప్రతినెల వస్తుంది.
2. రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్
పోస్ట్ ఆఫీస్ స్కీములు భారత ప్రభుత్వ హామీతో ఉండే ఒక స్కీం కాబట్టి పూర్తిగా రిస్క్ ఫ్రీగా పరిగణించబడతాయి.
3. టాక్స్ పై స్పష్టత
ఈ స్కీములో పెట్టిన మొత్తం మీద టాక్స్ మినహాయింపు 80సి ఉండదు. అయితే పొందే వడ్డీ పై టీడీఎస్ కట్ అవదు. అయినా మీ మొత్తం ఆదాయంలో ఈ వడ్డీని కలిపి ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లో చూపాలి. https://smstechintelugu.com/
వడ్డీ లెక్కింపు ఉదాహరణ
వడ్డీ రేటు;7.4 పెర్సెంట్
పెట్టుబడి;900000
సంవత్సర వడ్డీ; 900000*7.4% =66600
నెల వడ్డీ;66600 12= 5550
ఎవరెవరు ఖాతా తెరుచుకోవచ్చు
1. భారత పౌరుడై ఉండాలి.
2. వయస్సు 10 సంవత్సరాలు పైబడిన వారు అయి ఉండాలి
3. జాయింట్ ఖాతా కూడా తెరవచ్చు రెండు లేదా మూడు సభ్యులతో.
ఖాతా ఓపెనింగ్ విధానం
అవసరమైన డాక్యుమెంట్లు;-
ఆధార్ కార్డు
పాన్ కార్డ్
అడ్రస్ ప్రూఫ్
రెండు ఫోటోలు
ఖాతా ప్రారంభించేందుకు ఫారం.
ప్రక్రియ
1. సమీపపు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఫారం తీసుకోవాలి.
2. అవసరమైన డాక్యుమెంట్లు జతప్ చేయాలి.
3. డబ్బు డిపాజిట్ చేయాలి.
4.. ఖాతా ఓపెన్ చేసిన తరువాత నెలనెలా వడ్డీ చక్కగా ఎస్ బి కాదాలో లేదా ఈ సి ఎస్ ద్వారా వస్తుంది.
ప్రత్యేక లక్షణాలు
POMIS వడ్డీ మొత్తం మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ లేదా బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది.
వడ్డీ పొందకుండా వదిలితే దానికి వడ్డీ రాదు. కాబట్టి నెల నెల వాడుకోవడం మంచిది. పథకం గడువు అనంతరం మొత్తం తిరిగి తీసుకోవచ్చు లేదా మళ్లీ రిన్యూ చేసుకోవచ్చు. గడువు ముగియకముందే తీసుకోవాలంటే ఒక సంవత్సరము నుండి మూడు సంవత్సరాల మధ్య మొత్తం మీద 2% డిటెక్ట్ చేస్తారు మరియు మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య మొత్తం మీద వన్ పర్సెంట్ డిటెక్ట్ చేస్తారు. ఖాతా ఒక వ్యక్తి నుండి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. అయితే మరణం జరిగితే నామినీకి మొత్తం చెల్లిస్తారు. https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx
మైనర్ కాదా
10 ఏళ్లు పైబడిన పిల్లల పేరు మీద ఖాతా ప్రారంభించవచ్చు. వారు18 ఏళ్లు పూర్తయ్యాక ఫుల్ ఫ్లడ్ అమౌంట్ హోల్డర్ గా మారతాయి.
బ్యాంకులతో పోలిక
| అంశం | POMIS | FD/RD |
| ఆదాయం | నెల నెల వడ్డీ | FD లో చివరికి లంచం |
| భద్రత | 100% ప్రభుత్వ హామీతో | బ్యాంకు ఆధారంగా |
| లిక్విడిటీ | ముందు తీసుకుంటే పెనాల్టీ | FD కూడా అలానే |
| వడ్డీ రేటు | 7.4% | బ్యాంకు రేటు తక్కువగా ఉంటాయి |
POST OFFCE MONTHLY INCOME SCHEME IN TELUGU -2025
పోస్ట్ ఆఫీస్ ల ద్వారా నిర్వహిస్తున్న పలు పొదుపు స్కీములకు సంబంధించిన వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యధాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లు తెలిపింది. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్PPF సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంSCS చిన్న సుకన్య సమృద్ధి యోజన SSY వంటి సాధనాలపై ఆధారపడిన పొదుపు దారులకు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వారి రాబడిలో ఎలాంటి మార్పులు కనిపించవు.
పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పొదుపు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ మద్దతు పథకం పి పి ఎఫ్ గత త్రైమాసికంలో మాదిరిగానే వడ్డీ రేటును కొనసాగిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన స్కీం లకు ఆకర్షణీయమైన వార్షిక రేటును8.2% కొనసాగుతుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు ఇన్వెస్టర్లు 7.7% పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం 7.4% వద్ద స్థిరంగా ఉన్నాయి. కిసాన్ వికాస పత్ర కూడా మారలేదు. ఇది115 నెలల మెచ్యూరిటీ వ్యవధితో 7.5% రేటును అందిస్తుంది.
POST OFFCE MONTHLY INCOME SCHEME IN TELUGU -2025
ఇక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ లపై నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది. క్రమం తప్పకుండా నెలవారి పొదుపునకు అవకాశం ఉండే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకం6.7% వడ్డీ రేటును అందిస్తుంది.. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల గ్యారెంటీ రావణులను అందిస్తాయి, ఎంచుకున్న పథకం ఆధారంగా నెలవారి త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని జతచేస్తాయి.
ప్రధానంగా పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన స్థిర ఆదాయరావడిని కోరుకునే లక్షల మంది భారతీయులకు కీలక పెట్టుబడి సాధనాలు. శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫారసు చేసిన విధంగా ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడులను సంబంధించిన ఫార్ములాను ఉపయోగించి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వాటి రేట్లను సమీక్షిస్తుంది. అయితే మార్కెట్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ రేట్లు స్థిరంగా ఉంచాలని కేంద్రం నిర్ణయించింది.
POST OFFCE MONTHLY INCOME SCHEME IN TELUGU -2025
దీనిలో మీరు పెట్టిన పెట్టుబడిని బట్టి ప్రతినెల 5550 వరకు నెలవారి పింఛను లభిస్తుంది. అదే ఉమ్మడి ఖాతా అయితే 9250 వరకు నెలవారి పెన్షన్ పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ప్రభుత్వ భరోసా ఉంటుందన్న విశ్వాసం వారిలో బలంగా పనిచేస్తాయి. దీంతో ఆయా పథకాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా వృద్ధులు ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలపై ఎక్కువ నమ్మకంగా ఉంటారు. పోస్ట్ ఆఫీస్ కూడా అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెన్షన్ పథకాలకు దీనిలో మంచి డిమాండ్ ఉంటుంది. వృద్ధాప్యంలో నెలవారి స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఎంపికలుగా నిలుస్తున్నాయి. వృద్ధులకు రోజువారి ఖర్చులు వైద్య సంరక్షణ లేదా అనేక ఇతర అవసరాలను తీర్చడానికి వారికి ఈ నెల వారి ఆదాయం ఉపయోగపడుతుంది. PMJDY FULL DETAILS IN TELUGU.
అంతేకాక ఈ నెల వారి ఆదాయం వారి రోజువారి అవసరాల కోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదు. అలాంటి పోస్ట్ ఆఫీస్ పథకాలలో అత్యంత ప్రజాదరణ పొందింది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది ఒకసారి ఏక మొత్తం పెట్టుబడి తర్వాత నెలవారి ఆదాయాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. దీనిలో మీరు పెట్టిన పెట్టుబడిని బట్టి ప్రతినెల 5550 వరకు నెలవారి పింఛన్ లభిస్తుంది.. అదే ఉమ్మడి ఖాతా అయితే 9250 వరకు నెలవారి పెన్షన్ పొందవచ్చు.








