Walking Benifits;- వాకింగ్.. రోజు నడవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..2025

Walking Benifits;- వాకింగ్.. రోజు నడవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..2025 వాకింగ్ కూడా ఒక రకమైన యోగా లాంటిదే అని యోగాన్ని పునులు చెబుతున్నారు. అయితే, వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. వాకింగ్ అనేది ఒక సాధారణ వ్యాయామం. ప్రతిరోజు నడవడం చాలా మంచిది. ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది సులభమైన, తక్కువ ప్రభావం చూపే వ్యాయామం. రక్త ప్రసరణ నుండి గుండె ఆరోగ్యం వరకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు నడవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని యోగాన్ని పునులు చెబుతున్నారు. అయితే, వాకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గుండె జబ్బులు స్ట్రోక్ వంటి వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడం డిప్రెషన్ను తగ్గించడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో వాకింగ్ ఎంతగానో సహాయపడుతుంది. వాక్యం శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల మరింత ఫీట్ గా కూడా ఉంటారు.

మన ఆరోగ్యాన్ని బలోపేతం చేసే అత్యంత సరళమైన ఖర్చు లేని అందరికీ సాధ్యమైన వ్యాయామం నడక. రోజు క్రమంగా నడవడం వల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఆధునిక జీవనశైలిలో నడక మానేసి మోటారు వాహనాల మీద ఆధారపడుతున్న కాలంలో నడక ప్రాముఖ్యతను మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

    1.శారీరక ఆరోగ్యానికి నడక ప్రయోజనాలు

    1.1 గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది

    రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం ద్వారా గుండె దడలు సవ్యంగా ఉంటాయి. ఇది వృద్రోగాల అవకాశాలను తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఇది ప్రకృతి దత్త ఔషధం వంటిది.

    1.2 బరువు తగ్గడంలో సహాయం

    నడక వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గి బరువు సమతుల్యంలోకి వస్తుంది. ఇది లైట్ కానీ ఎఫెక్టివ్ ఫిట్నెస్ వ్యాయామం.

    1.3 మధుమేహాన్ని తగ్గిస్తుంది

    నడక వల్ల శరీరంలో ఇన్సులిన్ మెరుగవుతుంది. ఫలితంగా టైప్ టు డయాబెటిస్ మధుమేహం ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. భోజనం తరువాత నడక మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. https://smstechintelugu.com/

    1.4 జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

    నడక జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. ఆహారం తర్వాత జీర్ణమై శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. భోజనం తర్వాత15-20 నిమిషాలు నడవడం చాలా మంచిది.

    1.5 ఎముకలు కీళ్ల బలానికి ఉపయోగకరం

    నడక వల్ల శరీరంలోని కీళ్ల మధ్య తైల ఉత్పత్తి మెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే నడక ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది.

    2. మానసిక ఆరోగ్యానికి నడక ఉపయోగాలు

    2.1 ఒత్తిడిని తగ్గిస్తుంది

    హరిత వాతావరణంలో నడక మనసు ప్రశాంతతను కలిగిస్తుంది. మానసికంగా రిలాక్స్ అవుతారు. రోజు కొంత సమయం స్వేచ్ఛగా నడకకు కేటాయిస్తే మనసులోని ఆందోళన తగ్గుతాయి.

    2.2 మూడు ను మెరుగుపరుస్తుంది

    నడక సమయంలో శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన మూడును ఉత్తమంగా ఉంచుతాయి నిరాశ లేదా డిప్రెషన్ లో ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.

    2.3 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

    నడక మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది మెమొరీ ఫోకస్ క్రియేటివిటీ వంటి అంశాలను మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంలో డిమాండ్షియా అల్జీమర్స్ వంటి వ్యాధుల అవకాశాలు తగ్గుతాయి.

    3. నిద్రను మెరుగు పరచడం

    నడక వల్ల శరీరం శ్రమిస్తుంది ఫలితంగా రాత్రి నిద్ర సుఖంగా పడుతుంది ఇన్ఫోమియా బాధపడే వారికి రోజు నడకలు అలవాటు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

    4. శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు

    నడక సమయంలో గాలి పీల్చడం ఎక్కువగా జరుగుతుంది ఫలితంగా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది ఇది ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

    5. హార్మోన్ సమతుల్యత

    నడక వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంచబడతాయి ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ వంటి సమయంలో వచ్చే నొప్పులు పిసిఒడి వంటి సమస్యల నివారణలో సహాయపడతాయి.

    6. జీవనశైలిలో మార్పు

    నడకను అలవాటుగా చేసుకుంటే స్మార్ట్ఫోన్ టీవీ కంప్యూటర్ వంటి గ్యాడ్జెట్ ల మీద ఆధారపడే సమయం తగ్గుతుంది ఈ క్రియాశీలక జీవనశైలి జీవితంలో పాజిటివ్ మార్పులను తీసుకొస్తుంది.

    7. సామాజిక సంబంధాల పెరుగుదల

    గ్రూపుగా నడకకు వెళ్లేవారు తమ మధ్య బంధాన్ని బలపరచుకోగలరు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నడవడం ద్వారా కుటుంబ సమయం పెరుగుతుంది. ఇది సామాజికంగా మెరుగైన సంబంధాలకు దారితీస్తుంది. https://www.mayoclinic.org/healthy-lifestyle/fitness/in-depth/walking/art-20046261

    8. ఆధ్యాత్మిక ప్రయోజనాలు

    ప్రకృతిలో నడక మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమయంలో మనలో తాత్విక ఆలోచనలు మెరుగవుతాయి. కొంతమంది నడక సమయంలో మంత్ర జపం లేదా ధ్యానం చేస్తుంటారు, ఇది ఆధ్యాత్మికంగా శక్తిని కలిగిస్తుంది.

    9. డిజిటల్ డిటాక్సుకు తోడ్పాటు

    ఇప్పుడు మనం ఎక్కువ సమయం ఫోన్ లాప్టాప్ టీవీ లపై గడుపుతున్నాం. ఈ డిజిటల్ డిటాక్స్ కు నడక మంచి మార్గం.. బయటకు వెళ్లి నడవడం వల్ల మనం టెక్నాలజీ నుంచి కొంతకాలం దూరంగా ఉంటాం.

    10 సృజనాత్మకత పెరుగుతుంది

    చాలామంది రచయితలు, ఆలోచకులు నడవడంలో గొప్ప ఆలోచనలు పొందినట్లు చెప్పారు. నడక సమయంలో మన మెదడు క్రియాశీలకంగా పనిచేస్తుంది ఇది కొత్త ఆలోచనలకు వేదిక కల్పిస్తుంది.

    Walking Benifits;- వాకింగ్.. రోజు నడవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..2025

    నడక కోసం కొన్ని సూచనలు

    1. రోజు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవండి.

    2. మసురుబడిన ప్రాంతాల్లో కాకుండా ప్రకృతి పరిసరాల్లో నడకకి ప్రాధాన్యం ఇవ్వండి.

    3. చిటికెడు నీటిని మోసుకెళ్ళండి

    4. మొబైల్ సంగీతం వినడం కంటే మనసు ప్రశాంతంగా ఉంచి నడవడం మంచిది.

    5. భోజనం తరువాత తక్కువగా నడవడం మంచిది

    6. పాదరక్షలు వాడడం వల్ల కాళ్లకు బలహీనత రాదు

    నిరూపితమైన శాస్త్రీయ అంశాలు

    WHO ప్రకారం రోజుకి 30 నిమిషాలు నడవడం ద్వారా ఉద్యోగం ప్రమాదం35% తగ్గుతుంది.HARVARD HEALTH వారు తెలిపిన ప్రకారం నడక వల్ల డిప్రెషన్ సింటస్ 47% తగ్గుతాయని తేలింది.CDC ప్రకారం వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాలు నడక చేయాలి. నడక ఒక సాధారణమైన కానీ ప్రభావంతమైన ఆరోగ్య పద్ధతి. ఇది మన శరీరానికి మాత్రమే కాదు మనసుకు ఆత్మకు కూడా మేలు చేసే ఔషధం. నీటి టెక్నాలజీ ఆధారిత స్థూల జీవనశైలిలో ఈ చిన్న మార్పు రోజు నడక అలవాటు మన ఆరోగ్యాన్ని దృఢంగా నిలబెట్టగలదు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం అరగంట సమయం కేటాయించి నడకను జీవితంలో భాగం చేసుకోవాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మొదటి అడుగు నడకతోనే వేయండి.

    జాగ్రత్తలు

    పార్కులో వాకింగ్కు వెళ్లడం మంచిది. వాకింగ్ చేసేటప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం.. సౌకర్యవంతమైన బూట్లు ధరించండి లేదంటే వాకింగ్కు వెళ్లేనప్పుడు పాదాలకు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది నడకతో పాటు ఇతర వ్యాయమాలను కూడా చేయండి.

    Leave a Comment